ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం వేడుకలు

164

ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఎడపల్లి మండలంలోని అంగన్వాడీ కేంద్రాల్లో మహిళ టీచర్ల ను ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా ఐసీడీఎస్ సీడీపీఓ జానకమ్మ మాట్లాడుతూ…. పురుషులతో పాటు మహిళలకు సమాన హక్కులు కల్పించాలని, ప్రస్తుత సమాజంలో మహిళలపై జరుగుతున్న హింసను ప్రతి ఒక్కరు ఖండించాలని అన్నారు. మహిళా దినోత్సవం రోజున మాత్రమే మహిళలను గౌరవించడం కాకుండా ప్రతి రోజు మహిళల పట్ల విధేయత చూపాలని కోరారు. ఒక్కరోజు మాత్రమే మహిళా దినోత్సవం కాదని ప్రతిరోజు కూడా మహిళా దినోత్సవమేనని పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ప్రస్తుత కాలంలో ప్రతీ రంగంలోకి మహిళలు అడుగిడుతురన్నారు. ప్రతీ ఒక్కరూ అన్నిరంగాల్లో రాణించాలన్నారు.ఒకరిపై ఆధారపడకుండా మహిళలు తమ సమస్యలు తామే పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.తమ కూతుళ్ళకు కొడుకులతో సమానంగా ఉన్నత విద్యను అందిస్తే పురుషులతో సమానంగా ఎదగగలరని చెప్పారు. మహిళలు అన్నిరంగాల్లో సాధికారత సాధించినప్పుడే అటు గ్రామ ప్రగతితో పాటు దేశ ప్రగతి సాధ్యమన్నారు.మహిళా దినోత్సవం ప్రాముఖ్యతను, ప్రపంచంలో మహిళలు సాధించిన విజయాలను వివరించారు. మహిళలు సమాజంలో సగ భాగమని, ప్రభుత్వం కూడా అన్ని రంగాలలో ముఖ్యంగా రాజకీయాల్లోనూ 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చి ప్రోత్సహిస్తోందని అన్నారు. ఈ మేరకు అంగన్వాడీ టీచర్లకు ఆటలపోటీలు, రంగవల్లులు, ఎస్సే రైటింగ్ పోటీలను నిర్వహించారు. పోటిల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈకార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అమానుల్లా, సూపర్వైజర్ వినోద, అంగన్వాడీ టీచర్లు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.